Achinta Sheuli : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ కు మూడో స్వ‌ర్ణం

స‌త్తా చాటిన చాను..జెరెమి..అచింత షెవులి

Achinta Sheuli : బ్రిట‌న్ వేదిక‌గా బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ -2022 లో భార‌తీయ క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. త‌మ‌దైన ప్ర‌తిభ‌తో రాణిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ప‌త‌కాల సంఖ్య ఆరుకు చేరింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో క్రీడాకారులు దుమ్ము రేపారు. భార‌త్ కు తొలి స్వ‌ర్ణం మీరా బాయి చాను సాధిస్తే..రెండో స్వ‌ర్ణాన్ని జెరెమీ చేజిక్కించుకుని చ‌రిత్ర సృష్టించాడు.

అత‌డికి ప‌ట్టుమ‌ని 19 ఏళ్లే. ఇక మూడో బంగారు ప‌తకాన్ని భార‌త్ కు ద‌క్కేలా చేశాడు అచింత షెవులి. ఇది ఓ రికార్డు త‌న కెరీర్ లో. మొత్తంగా చూస్తే వెయిట్ లిఫ్ట‌ర్ల హ‌వా మ‌రింత పెరిగింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టి దాకా సాధించిన ప‌త‌కాల‌న్నీ ఈ విభాగం లోనివే కావ‌డం విశేషం. 73 కేజీల విభాగంలో అచింత షెవులి(Achinta Sheuli) రికార్డు ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌సిడి కైవ‌సం చేసుకున్నాడు.

స్నాచ్ లో 143 కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్ లో 170 కేజీల బ‌రువు ఎత్తాడు షెవులి. మొత్తంగా 313 కేజీల బ‌రువు ఎత్తి కామ‌న్వెల్త్ గేమ్స్ లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు.

ఇదే విభాగంలో 73 కేజీల ఈవెంట్ లో మ‌లేషియాకు చెందిన ఎర్రి హిదాయ‌త్ మ‌హ‌మ్మ‌ద్ 303 కేజీల బ‌రువు ఎత్తి ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించాడు. కెన‌డాకు చెందిన షాడ్ డార్సిగ్ని కాంస్యంతో స‌రి పెట్టుకున్నాడు.

ఇక 55 కేజీల విభాగంలో సార్గ‌ర్ ర‌జ‌తం, బింద్యారాణి దేవి ర‌జ‌తం, 61 కేజీల విభాగంలో గురు రాజ్ పూజారి కాంస్య ప‌త‌కం సాధించాడు.

ప‌త‌కాలు సాధించిన విజేత‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : మంధాన మెస్మ‌రైజ్ ఇన్నింగ్స్ స‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!