Rajinikanth : తలైవాకు బాలయ్య గ్రాండ్ వెల్ కమ్
బెజవాడకు చేరుకున్న సూపర్ స్టార్
Rajinikanth : సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బెజవాడకు చేరుకున్న రజనీకాంత్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. దివంగత సీఎం , నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు రజనీకాంత్(Rajinikanth) ఇక్కడికి వచ్చారు. భారీ ఎత్తున అభిమానులు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్నారు.
రజనీకాంత్ , బాలకృష్ణ ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేయడం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ నిర్వహిస్తారు. ఇప్పటికే వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 వేల మందికి పైగా కూర్చునేందుకు వీలుగా వసతి కల్పించారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, రజనీకాంత్(Rajinikanth) , ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవుతారు.
ఇదిలాఉండగా ఎన్టీఆర్ కు సంబంధించిన విశేషాలతో కూడిన పుస్తకాలను ఈ సందర్బంగా ఆవిష్కరించనున్నారు. తెలుగు వారి రాజకీయాలలో పెను సంచలనం ఎన్టీఆర్. ఆ మూడు అక్షరాలు కలిగిన పేరు దేశ రాజకీయాలలో పెను మార్పు తీసుకు వచ్చింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేలా చేసింది ఎన్టీఆర్.
Also Read : హిందీ వద్దు తమిళం ముద్దు – రెహమాన్