VK Naresh Ramya : రమ్య నుంచి ప్రాణగండం – నరేష్
సుపారీ కూడా ఇచ్చిందని షాకింగ్ కామెంట్స్
VK Naresh Ramya : పవిత్ర, నరేష్ వ్యవహారంలో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఈ ఇద్దరు తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఇప్పటికే ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. తాజాగా నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ భార్య రమ్య రఘుపతి తనను చంపేందుకు కుట్ర పన్నిందంటూ మండిపడ్డారు(VK Naresh Ramya). తనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ తో కలిసి ప్లాన్ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటుడు నరేష్. ఇదిలా ఉండగా వీరిద్దరి వ్యవహారంలో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంది. మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇక యాక్టప్ వీకే నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. పవిత్ర లోకేష్ తో ఉన్న తనను చంపాలని చూస్తోందన్నారు. విషం పెట్టి తనను పైకి లేపాలని చూసిందన్నారు.
బీహార్ నుంచి ప్రత్యేకంగా మనుషులను ఇక్కడికి తీసుకు వచ్చిందని , వారు తనను చంపేందుకు నానా తంటాలు పడుతున్నారంటూ ఆరోపించారు నరేష్ . రమ్య కుట్ర తనకు తెలిసిందని అందుకే తాను ఆమెకు దూరంగా ఉంటున్నానని వాపోయారు(VK Naresh Ramya).
పవిత్రతోనే తాను ఉండాలని నిర్ణయం తీసుకున్నానని, తనను ఆపే దమ్ము ఆమెకు లేదన్నారు నటుడు నరేష్. తన తల్లి విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిందని , ఆ తర్వాత సానుభూతి పొందిందని , తనను ఇబ్బందికి గురి చేసిందని ఆరోపించారు .
రోజు రోజుకు తనలోని అసలు రూపం బయట పడిందన్నారు. పెళ్లి అయిన నెల రోజుల నుంచే తనను టార్గెట్ చేస్తూ వచ్చిందన్నారు. ఆ తర్వాత తన కొడుకును కూడా కొట్టిందన్నారు నరేష్.
Also Read : కోట్లు కొల్లగొడుతున్న పఠాన్