Adani NDTV : ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా అదానిదే
తమకు ఏమీ తెలియదన్న మీడియా సంస్థ
Adani NDTV : భారతీయ వ్యాపార దిగ్గజాలు రిలయన్స్ గ్రూప్ , అదానీ గ్రూప్ కంపెనీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో దూసుకు పోతున్నాయి.
నిన్నటి దాకా అంతగా ఫోకస్ పెట్టని టెలికాం, మీడియాపై ఓ కన్నేసింది అదానీ. ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ మీడియా పరంగా ఎంట్రీ ఇచ్చింది.
అంతే కాదు వయా కామ్ ద్వారా ఆటలలోకి ప్రవేశించింది. రాబోయే ఐదేళ్లకు గాను భారీ ఎత్తున క్రికెట్ డిజిటల్ రైట్స్ ను చేజిక్కించుకుంది.
ఇక 5జీ స్పెక్ట్రమ్ వేలంలోకి ఊహించని రీతిలో అదానీ గ్రూప్ రంగంలోకి దిగడం అందరినీ విస్తు పోయేలా చేసింది. తాజాగా మరో షాక్ ఇచ్చింది అదానీ సంస్థ.
న్యూస్ 18 ఛానల్ ను తీసుకుంది రిలయన్స్ . దానికి పోటీగా అదానీ తానేమీ తక్కువ కాదంటూ ఏకంగా ఇండియాలో మోస్ట్ పాపులర్ ఛానల్ గా పేరొందిన ఎన్డీటీవీలో(Adani NDTV) వాటాను కొనుగోలు చేసింది.
ఈ విషయం సదరు సంస్థకే తెలియక పోవడం విశేషం. దీంతో రిలయన్స్ , అదానీ గ్రూప్ లు మీడియా సంస్థలోకి పోటీకి దిగాయన్నమాట.
ఇదిలా ఉండగా ఎన్డీటీవీ (న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ )లో 29 శాతానికి పైగా వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. సాధారణ వాటాదారుల నుండి వాటా కొనుగోలు కోసం ఆఫర్ ను డిక్లేర్ చేసింది.
ఇందుకు మదుపరులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రారంభ షేరు ధర రూ. 294గా నిర్ణయించింది. దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించు కోవాలని యోచిస్తోంది అదానీ గ్రూప్.
Also Read : పేటీఎం చీఫ్ గా విజయ్ శేఖర్ శర్మ