Telangana ACB: ఏసీబీ వలలో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్
ఏసీబీ వలలో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్
Telangana ACB : తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ (Telangana ACB) అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంబేడ్కర్ బంధువు ఇంట్లో రూ.2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన… భారీగా ఆస్తులు కూడబెట్టారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
Telangana ACB Shocking
గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ (Telangana ACB) అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద గోనె సంచెలో మహిళ మృతదేహం
చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద గోనె సంచెలో మహిళ మృతదేహం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఉదయం 11.45 గంటలకు మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. బిహార్‌కు వెళ్లే రైలు కోసం నిన్న భారీగా ప్రయాణికులు స్టేషన్ సమీపంలో వేచి ఉన్నారు… అదే సమయంలో ఆటోలో అక్కడికి వచ్చిన వ్యక్తి మూటను వదిలి వెళ్లినట్టు గుర్తించారు. బిహార్‌కు వెళ్లే రైలు ఆలస్యంగా రావడంతో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత అక్కడ మూట ఉండటాన్ని స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : CM Siddaraiah: రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు ధవన్ రాకేశ్ ?
