Adhir Ranjan Chowdhury : బెంగాల్ లో ఎమర్జెన్సీ ప్రకటించండి
కాంగ్రెస్ అగ్ర నేత అధిర్ రంజన్ చౌదరి
Adhir Ranjan Chowdhury : పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యులు, ప్రజలకు సెక్యూరిటీ లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్ర నేత అధిర్ రంజన్ చౌదరి.
బెంగాల్ ని బీర్బూమ్ లో చోటు చేసుకున్న సజీవ దహనం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ ఘటనకు సంబంధించి బెంగాల్ సర్కార్ కోల్ కతా కోర్టును ఆశ్రయించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ వద్దని సిట్ విచారణ జరిపేలా అవకాశం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిని హైకోర్టు నిర్దద్వందంగా తిరస్కరించింది. బీర్బూమ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో పశ్చిమ బెంగాల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ తరుణంలో సీబీఐ రంగంలోకి దిగింది. సజీవ దహనం కేసులో 21 మంది నిందితులని పేర్కొంది. టీఎంసీ లీడర్ ప్రమేయం ఉందంటూ ప్రకటించి సంచలనానికి తెర తీసింది.
ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో కన్నీటి పర్యంతం అయ్యింది. తాజాగా బీర్భూమి ఘటనపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ అగ్ర నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury).
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు బెంగాల్ లో చాలా చోటు చేసుకున్నాయని, అక్కడ బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు అధిర్ రంజన్ చౌదరి.
Also Read : బీహార్ సీఎంపై దాడి – వ్యక్తి అరెస్ట్