Parliament Adjourned : పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాల నిలదీత
Parliament Adjourned : ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా(Parliament Adjourned) పడ్డాయి. ప్రారంభమైన కొద్ది సేపటికే సభా నిర్వహణను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో లోక్ సభ కూడా వాయిదా పడింది. ఇవాళ ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పదవి కోసం ఎన్నిక జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతూ వస్తోంది.
మంగళవారం ఉదయం దాకా సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఇక జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఈఏ మాజీ చీఫ్ షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహన్ మృతి సందర్భంగా భారత పార్లమెంట్ నివాళి అర్పించింది.
ఇదిలా ఉండగా ఈనెల 18న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు వచ్చే ఆగస్టు 12 దాకా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఇక తెలంగాణకు సంబంధించి గిరిజన యూనివర్శిటీ మంజూరుకు సంబంధించి బిల్లు చర్చకు రానుంది. అంతకు ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) ప్రసంగించారు. పార్లమెంట్ లో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సూచించారు. ప్రవేశ పెట్టబోయే 32 బిల్లులకు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపాలని పీఎం కోరారు.
Also Read : జడ్జి ఇతర విషయాలపై ఫోకస్ పెట్టారు