Aero India Kicks : అద్భుతం వైమానిక దళం విన్యాసం
ఏరో షో ఏరో ఇండియా 2023 ప్రారంభం
Aero India Kicks : ఆసియా లోనే అతి పెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023(Aero India Kicks) ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో ఈ మెగా షోను సోమవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
ఇందులో 809 కంపెనీలు, 98 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా వైమానిక దళ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన వైమానిక దళాల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు వీలుగా దీనిని భారత దేశం ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం భారత్ ప్రపంచ దేశాలతో కూడిన జీ20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూరులో అతి పెద్ద ఏరో షో ఏరో ను ప్రారంభించింది. భారత వైమానిక దళానికి చెందిన సీ17 గ్లోబ్ మాస్టర్ సూర్య కిరణ్ ఏరో బాటిక్ బృందంతో చుట్టుముట్టింది. ఈవెంట్ కు సంబంధించిన 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చు కోవడానికి స్వదేశీ పరికరాలు , సాంకేతికతలను ప్రదర్శిస్తుంది.
ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో షో ఉత్కంఠ భరితమైన ఎయిర్ షోలు(Aero India Kicks), ఏరో బాటిక్స్, ఎగ్జిబిషన్లతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యుఎస్ఏఎఫ్) ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ ద్వయం రోజూ వారీ వైమానిక ప్రదర్శనలను నిర్వహించింది.
మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విధానం ప్రకారం లాక్ హీడ్ మార్టిన్ కార్ప్ , బోయింగ్ , ఎయిర్ బస్ వటి తయారీదారులు సాంకేతికతను పంచు కోవాలని కోరారు.
Also Read : భారత్ తో యుఎస్ బంధం ముఖ్యం – జోన్స్