Flight: విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని భారత్ వచ్చిన అప్ఘాన్ బాలుడు
విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని భారత్ వచ్చిన అప్ఘాన్ బాలుడు
Flight : విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ లో దాక్కుని ఓ 13 ఏళ్ల అప్ఘాన్ బాలుడు భారత్ చేరుకున్నాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో బాలుడ్ని గుర్తించిన అధికారులు తిరిగి మరో విమానంలో (Flight) వెనక్కు పంపించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఈ ఘటన… ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Flight – Afghan Boy
కేఏఎం విమానయాన సంస్థ విమానం (Flight) ఆర్‌క్యూ-4401 దాదాపు రెండు గంటలు ప్రయాణించి ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ లో దాక్కుని ఓ బాలుడు అప్ఘానిస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చాడు. అతడిని కుందుజ్ ప్రాంతానికి చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. ఉదయం 11.10 గంటల సమయంలో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యాక అధికారులు బాలుడిని గుర్తించారు. విమానానికి సమీపంలో తచ్చాడుతూ తిరుగుతున్న అతడు సిబ్బంది కంట పడ్డాడు. అతడిని చూడగానే ఒకింత ఆశ్చర్యపోయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కామ్ ఎయిర్ సిబ్బంది కూడా విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో చిన్న ఆడియో స్పీకర్ కనిపించింది. టిక్కెట్, ఇతర అనుమతులేవీ లేకుండా అక్రమంగా భారత్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కాబూల్ విమానాశ్రయంలోకి రహస్యంగా చొరబడి.. వెనకవైపున్న సెంట్రల్ ల్యాండింగ్ గేర్ లోపలకు వెళ్లానని, కేవలం ఉత్సాహంతోనే అలా చేశానని బాలుడు వెల్లడించాడు. ప్రయాణ సమయంలో తాను ఈ కంపార్ట్‌మెంట్‌లోనే దాక్కున్నట్టు బాలుడు సెక్యూరిటీకి చెప్పారు. ల్యాండింగ్ గేర్‌లో అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. జర్నీ సమయంలో అక్కడ గాలి పీడనం, ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని, వీటిని తట్టుకుని బాలుడు ప్రాణాలతో ఉన్నాడంటే అద్భుతమేనని కామెంట్ చేశారు. అతడిని ప్రశ్నించిన అనంతరం అధికారులు మరో విమానంలో వెనక్కు పంపించేశారు. కామ్ ఎయిర్‌కు చెందిన ఆర్‌క్యూ-4402 విమానంలో అతడు తిరుగు ప్రయాణమయ్యాడు.
Also Read : Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంకర్ కు 23 కోట్లు కుచ్చుటోపీ !
