MLC Kavitha Case : మళ్లీ పొడిగించిన ఎమ్మెల్సీ కవిత జుడీసీఎల్ కస్టడీ

మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది...

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత రిమాండ్ జూలై 25 వరకు పొడిగింపు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. కేసు తదుపరి విచారణను జూలై 25కి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. మద్యం పాలసీ స్కామ్‌లో ఢిల్లీ, తిహార్ జైలులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి కవిత బెయిల్ పిటిషన్‌ను ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

MLC Kavitha Case Update

మహిళ అనే కారణంతో కవితపై(MLC Kavitha) సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. విద్యావంతురాలిగా, గౌరవప్రదమైన మహిళగా ఆమె చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఈ కేసులో కవితపై ఉన్న సాక్ష్యాలు, ఆమె పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలా? కాదా? అనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈడీ సేకరించిన ఆధారాల ప్రకారం ఢిల్లీలో జరిగిన కొత్త మద్యం పాలసీ కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరు. వీరి కోసం ఈ కేసులోని ఇతర నిందితులు కూడా పనిచేస్తున్నట్లు తేలింది. ఆమెను నిస్సహాయ మహిళగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆమె బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

Also Read : MLA Danam : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Leave A Reply

Your Email Id will not be published!