#PetrolDiesel : మరోసారి పెట్రోల్, డీజిల్ భగ భగ
ధారాభారంపై ఆగ్రహం
Petrol Diesel : కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఆయిల్ కంపెనీలపై నియంత్రణ లేక పోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
ధరా భారం మోయలేమంటూ మండి పడుతున్నారు. శ్రీలంక, నేపాల్, తదితర దేశాల్లో లీటర్ పెట్రోల్ ధరలు 60 రూపాయల లోపు ఉంటే ఇండియాలో మాత్రం 100 రూపాయలకు దగ్గర రావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర సర్కార్ర పై నిప్పులు చెరిగారు.
ఇదెక్కడి ప్రభుత్వం అంటూ ఆయన తన స్వంత పార్టీని నిలదీశారు. ఇదే విషయాన్ని ఆయన అంకెలతో సహా ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. అది వైరల్ కూడా అయింది. తాజాగా ఇప్పటి దాకా రికార్డు స్థాయికి ధరలు చేరా, ప్రస్తుతం చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ , డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి.
ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు(Petrol Diesel) 87 రూపాయలు, డీజిల్ ధర 77 రూపాయలకు చేరింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు 14 రూపాయలకు పైగా పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 90.10 , డీజిల్ ధర 83 రూపాయలు గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ధర 94 రూపాయలు, డీజీల్ 84 రూపాయలు గా ఉంది.
కోల్ కతాలో పెట్రోల్ ధర 88 రూపాయలు, డీజిల్ 81 రూపాయలు ధర పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 90 , డీజిల్ 83 రూపాయలు ఉండగా , బెంగళూరులో పెట్రోల్ 90 రూపాయలు, డీజిల్ 82 రూపాయలు లీటరు చొప్పున ధర ఉంది. ఇదిలా ఉండగా రాయితీ లేని సిలిండర్ పై 25 రూపాయలు ఇండియన్ ఆయిల్ కంపెనీ పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
No comment allowed please