Covid19 Cases Updates : పెరిగిన కరోనా కేసులతో పరేషాన్
రోజు రోజుకు కొత్త కేసుల నమోదు
Covid19 Cases Updates : ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఉన్నట్టుండి కేసులు నమోదు కావడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ లు వేసుకోవాలని కోరింది. దేశ వ్యాప్తంగా టీకాలను అందుబాటులో ఉంచినట్లు ఇప్పటికే ప్రకటించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
గత 24 గంటల్లో 3,230 కొత్త కేసులు(Covid19 Cases) నమోదయ్యాయి. 32 మరణాలు సంభవించాయి. కొత్తగా చోటు చేసుకున్న మరణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,562కి చేరుకుంది. ఇందులో కేరళ ఒక్క రాష్ట్రంలోనే 22 కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా క్రియాశీల కేసులు మొత్తం ఇన్ఫెక్షన్ లలో 0.10 శాతంగా నమోదయ్యాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 4,45,75,473కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 42,358కి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెళ్లడించింది. కాగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగిందని స్పష్టం చేసింది.
గత 24 గంటల వ్యవధిలో 1,057 కేసులు తగ్గుముఖం పట్టాయి. మరో వైపు కరోనా కేసుల(Covid19 Cases) పరంగా చూస్తే ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది.
అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్ ను అధిగమించింది. గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలు రాయిని దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.
Also Read : దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులు