Aganampudi Tollgate: అగనంపూడి టోల్‌గేట్‌ ను తొలగించిన టీడీపీ నేతలు !

అగనంపూడి టోల్‌గేట్‌ ను తొలగించిన టీడీపీ నేతలు !

Aganampudi Tollgate: విశాఖపట్నం జిల్లా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్‌ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధి అగనంపూడి టోల్‌ గేటు(Aganampudi Tollgate)ను స్థానిక తెలుగుదేశం నాయకులు తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి టోల్‌ నిర్వహణను కాంట్రాక్టు తీసుకున్న సంస్థ ఏటా రుసుములు పెంచుతూ జనంపై భారం మోపుతోంది. గడువు పూర్తయిన తరువాత కూడా టోల్ వసూళ్లు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో గాజువాక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కోర్టును ఆశ్రయించి టోల్‌ గేటు మూసేయించారు.

Aganampudi Tollgate…

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరల టోల్‌గేట్‌ను తెరిచి… వసూళ్లు చేపట్టారు. దీంతో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిస్తే టోల్‌ గేటు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం టోల్‌ రుసుము వసూళ్లను అడ్డుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టోల్‌గేట్‌ కౌంటర్లను కూల్చి వేయించారు.

Also Read : Rohit Sharma : సెమీ ఫైనల్ లో విధ్వంస భరిత ఆటతో మైమరపించిన రోహిత్

Leave A Reply

Your Email Id will not be published!