Agnipath Army Notifcation : అగ్నిప‌థ్ భ‌ర్తీకి ఆర్మీ నోటిఫికేష‌న్

24న ఎయిర్ ఫోర్స్ కు చాన్స్

Agnipath Army Notifcation : ఓ వైపు దేశ వ్యాప్తంగా అగ్నిప‌థ్ స్కీం వ‌ద్దంటూ యువ‌త రోడ్డెక్కింది. నిర‌స‌న‌లు చేస్తోంది. ఆందోళ‌న బాట ప‌ట్టింది. కానీ కేంద్రం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో వెన‌క్కి త‌గ్గేదేలే అంటోంది.

ఈ మేర‌కు సోమవారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అగ్నిప‌థ్ స్కీంలో భాగంగా ఇండియ‌న్ ఆర్మీలో అగ్నివీర్ నియామ‌కాల‌కు నోటిఫికేష‌న్(Agnipath Army Notifcation)  రిలీజ్ చేసింది.

ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ , నేవీలో కూడా అగ్నివీర్ ల నియామకాల‌కు సంబంధించిన తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది. 21న ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి, 24న నేవీకి సంబంధించిన నోటిఫికేష‌న్లు(Agnipath Army Notifcation)  విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది.

భార‌తీయ భ‌ద్ర‌తా ద‌ళంలో చేరేందుకు ఆస‌క్తి క‌లిగిన వారంతా ఈనెల 20 నుంచే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేసింది. ఇందుకు గాను షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆఫీస‌ర్ దిగువ ర్యాంకు సిబ్బందిగా దీనిని పేర్కొంది.

కేంద్రీకృత ప‌ద్ధ‌తిలో ఎప్ప‌టి లాగే ర్యాలీలు, క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూ , త‌దిత‌ర ప‌ద్ద‌తుల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఇది పూర్తిగా నాలుగేళ్ల కాల ప‌రిమితికి మాత్ర‌మే ఎంపిక ఉంటుంది. ఎలాంటి హ‌క్కు ఉండ‌దు.

ఈ సంవ‌త్స‌రం మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల‌లో 46,000 మందిని ఎంపిక చేస్తారు. మూడు నెల‌ల్లో ప్ర‌క్రియ స్టార్ట్ అవుతుంది. అయితే గ‌తంలో త్రివిధ ద‌ళాల్లో నిర్దేశించిన రూల్స్ ఇక్క‌డ వ‌ర్తిస్తాయి.

ఆల్ ఇండియా క్లాస్ బేస్ విధానాన్ని అమ‌లు ప‌రుస్తారు. విధుల్లో చేరే వారిని అగ్ని వీర్ గా పిలుస్తారు. తొలి ఏడాదికి రూ. 31 వేలు ఇస్తారు. ఇందులో 9 వేలు కార్ప‌స్ నిధికి వెళుతుంది.

21 వేలు చేతికి వ‌స్తాయి. నాలుగో ఏడాదికి రూ. 40 వేలు ఇస్తారు. స‌ర్వీసు పూర్త‌యితే రూ. 11.71 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఒక‌వేళ చ‌ని పోతే రూ. 1 కోటి అంద‌జేస్తుంది కేంద్రం.

స‌ర్వీస్ లో ప‌ని చేసినంత కాలం రూ. 48 ల‌క్ష‌ల ఉచిత జీవిత బీమా ఉంటుంది. గ్రాట్యుటీ, పెన్ష‌న్ అన్న‌ది ఉండ‌దు.

Also Read : అగ్నివీరుల‌కు మ‌హీంద్ర స్వాగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!