Agnipath Protests : అగ్నిప‌థ్ పై ఆగ్ర‌హం బీజేపీ ఆఫీసు ధ్వంసం

బీహార్ లో ఎమ్మెల్యేపై దాడి రైల్వే కోచ్ కు నిప్పు

Agnipath Protests : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీం(Agnipath Protests) అగ్గిని రాజేసింది. కేవ‌లం నాలుగు ఏళ్ల కాలానికి సాయుధ ద‌ళాల‌లో తీసుకునేందుకు ఈ ప‌థ‌కం ఉద్దేశించింది.

దీనిని మోదీ ప్ర‌క‌టించిన వెంట‌నే ఒక్క‌సారిగా యువ‌త‌లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. నిన్న బీహార్ లో శాంతియుతంగా సాగిన నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు గురువారం ఉగ్ర‌రూపం దాల్చింది.

ఏకంగా బీహార్ లోని న‌వాడాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌లాయానికి నిప్పు పెట్టారు. ఓ నాయ‌కుడిపై దాడికి పాల్ప‌డ్డారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జెహ‌నాబాద్ రైల్వే స్టేష‌న్ లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు రాళ్లు రువ్వుకున్నారు. అక అర్రాలో నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు టియ‌ర్ గ్యాస్ షెల్స్ ప్ర‌యోగించారు.

ప‌రిస్థితిని అదుపు చేయ‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు. ఆర్మీలో చేరాల‌ని అనుకునే వారంతా రోడ్ల‌పైకి వ‌చ్చారు. బీహార్ లోని అనేక ప్రాంతాల్లో రైళ్ల రాక పోక‌ల‌ను అడ్డుకున్నారు.

ర‌హ‌దారుల‌పై బైఠాయించారు. అగ్ని ప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా, ప్ర‌ధాన మంత్రి మోదీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రైలు బోగీల‌కు నిప్ప‌టించారు. రోడ్ల‌పై ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది.

బ‌స్సుల కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. అగ్నిప‌థ్ స్కీం(Agnipath Protests) ఉప‌సంహ‌రించు కోవాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల‌పై నిప్పులు చెరిగారు.

అల్ల‌ర్ల నేప‌థ్యంలో 22 రైళ్ల‌ను ర‌ద్దు చేసింది రైల్వే శాఖ‌. ఇక భ‌భువా రోడ్ రైల్వే స్టేష‌న్ లో ఇంట‌ర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలు ప‌గుల‌గొట్టారు.

ఒక కోచ్ కు నిప్పంటించారు. న‌వాడాలో కోర్టుకు వెళుతున్న బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవి వాహ‌నంపై దాడికి పాల్ప‌డ్డారు.

Also Read : అగ్గి రాజేసిన అగ్నిప‌థ్ స్కీం

Leave A Reply

Your Email Id will not be published!