Justice Hima Kohli : న్యాయ రంగంలో ఏఐ గేమ్ ఛేంజర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ
Justice Hima Kohli : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలకలం రేపుతోంది. తాజాగా టెక్నాలజీలో వచ్చిన మార్పు దెబ్బకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ(Justice Hima Kohli) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయ రంగగంలో గేమ్ ఛేంజర్ గా మారనుందని పేర్కొన్నారు.
అయితే న్యాయ స్థానంలో ఏఐని ఉపయోగించడం వల్ల ఏర్పడే జవాబుదారీతనం, పారదర్శకత, పార్టీల హక్కుల రక్షణ గురించిన నైతిక ఆందోళలను కూడా జస్టిస్ హిమా కోహ్లీ లేవనెత్తారు. బాటమ్ లైన్ ఏమిటంటే ఏఐ ఎప్పటికీ మానవ విలువలను భర్తీ చేయదని స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ముప్పుగా చూడ వద్దని కోరారు. ఇదే క్రమంలో న్యాయ ప్రాక్టీస్ నాణ్యతను పెంపొందించే అవకాశంగా భావించాలని పేర్కొన్నారు జస్టిస్ హిమా కోహ్లీ.
న్యాయ వాదుల పని విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. కరోనా కష్ట కాలంలో టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషించిందన్నారు. జూమ్ ద్వారా తీర్పులు చెప్పామని గుర్తు చేశారు జస్టిస్ హిమా కోహ్లీ(Justice Hima Kohli) . ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లీగల్ సెక్టార్ అనే అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీ వల్ల తమ నైపుణ్యం నిరుపయోగం అవుతుందని న్యాయవాదులు భయపడడం సహజమే. నాకైతే ఏఐని ముప్పుగా చూడవద్దని కోరారు. చట్ట పరమైన అభ్యాసం నాణ్యతను పెంచే అవకాశంగా పరిగణించాలని స్పష్టం చేశారు.
Also Read : ప్రజా సంక్షేమం మోదీ ప్రచారం