Mallikarjun Kharge : జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ అరుదైన నాయ‌కుడు

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కామెంట్

Mallikarjun Kharge : క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంద‌న్నారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. భార‌తీయ జ‌న‌తా పార్టీ నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించాడు మాజీ సీఎం జ‌గ‌దీశ్ షెట్ట‌ర్. హై క‌మాండ్ ప‌ద‌వి తాయిలం చూపినా ప‌ట్టించు కోలేదు షెట్ట‌ర్. డోంట్ కేర్ అంటూ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆపై పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా గుడ్ బై చెప్పుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ల‌తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చివ‌ర‌కు జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ హ‌స్తంతో జ‌త క‌ట్టేందుకు డిసైడ్ అయ్యాడు. షెట్ట‌ర్ బ‌ల‌మైన లింగాయ‌త్ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు క‌లిగిన నాయ‌కుడు. దీంతో ఆయ‌న రాక‌తో త‌మ పార్టీకి మ‌రింత బ‌లం పెరిగింద‌న్నారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఇవాళ జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ కు పార్టీలోకి జెండా క‌ప్పి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ అరుదైన నాయ‌కుడ‌ని కితాబు ఇచ్చారు. ఆయ‌న విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నార‌ని, బీజేపీ స‌ర్కార్ అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. మ‌రికొంద‌రు బీజేపీ నుంచి వ‌ల‌స‌లు ఉంటాయ‌ని జోష్యం చెప్పారు.

Also Read : షెట్ట‌ర్ షాక్ కాంగ్రెస్ లోకి జంప్

Leave A Reply

Your Email Id will not be published!