Air Hostess: ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎయిర్‌ హోస్టేస్‌ పై అత్యాచారం

ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎయిర్‌ హోస్టేస్‌ పై అత్యాచారం

Air Hostess : హరియాణాలోని గురుగ్రామ్‌ లో దారుణం జరిగింది. ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మీద జాలి పడాల్సింది పోయి… దారుణంగా ప్రవర్తించారు కామాంధులు. కామంతో కళ్లు మూసుకుపోయి… పేషెంట్ అని జాలి కూడా చూపకుండా… లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఆమె అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Air Hostess Raped by..

హరియాణాలోని(Hariyana) గురుగ్రామ్‌ లో పది రోజుల క్రితం అనగా ఏప్రిల్ 6, 2025 నాడు చోటు చేసుకుంది. బాధితురాలి భర్త ఏప్రిల్ 13 పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఎయిర్‌హోస్టెస్‌(Air Hostess) గా పని చేస్తున్న 46 సంవత్సరాల మహిళ ఒకరు… కంపెనీ ట్రైనింగ్ నిమిత్తం ఏప్రిల్ 4న గురుగ్రామ్‌(Gurugram) వచ్చింది. అక్కడ ఉన్న ఓ హోటల్‌ లో బస చేసింది. ఈ క్రమంలో హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతుండగా… జారిపడింది. అది గమనించిన హోటల్ సిబ్బంది ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్తకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఎయిర్‌ హోస్టెస్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె భర్త… ఏప్రిల్ 5న బాధితురాలిని మరో ఆస్పత్రికి తరలించాడు. సుమారు 9 రోజుల పాటు ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న ఆమెను డిశ్చార్జ్ చేశారు.

అయితే ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత బాధితురాలు… హస్పిటల్ లో ఉండగా తనకు ఎదురైన దారుణం గురించి భర్తకు వివరించింది. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉండగా తాను లైంగిక దాడికి గురైనట్లు ఆమె తెలిపింది. దీనితో అవక్కైన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ… “నా ఆరోగ్యం విషమించడంతో… ఏప్రిల్ 6 వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో ఆస్పత్రి సిబ్బంది కొందరు నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారు చేసే దారుణం గురించి నాకు తెలుస్తుంది… కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. మత్తులో ఉన్నాను.

దారుణం ఏంటంటే… అక్కడే ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. కానీ వారు కనీసం స్పందించలేదు. ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను” అని చెప్పుకొచ్చింది. దీనితో బాధతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి… దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి ఆ రోజు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరు అని ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి.

Also Read : Digvijaya Singh: రామ్ దేవ్ బాబా పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!