Air India: ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి ! తప్పిన పెను ప్రమాదం !
ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి ! తప్పిన పెను ప్రమాదం !
Air India : ఎయిర్ ఇండియా విమానాలు వరుస కష్టాలను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి పుణెకు శుక్రవారం ఉదయం బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. విమానం సురక్షితంగా పుణెలో ల్యాండ్ అయిందని, సేఫ్టీ చెక్‌లో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్టు గుర్తించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్‌ను రద్దు చేశామని తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ప్రత్యామ్నాయ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.
Air India Flight Cancelled
కాగా, పలు అంతర్జాతీయ విమాన సర్వీసులతోపాటు దేశంలో నడిచే వివిధ విమాన సర్వీసులను సైతం రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారంనాడు ప్రకటించింది. విమాన సర్వీసుల భద్రత తనిఖీలు, వాతవరణ పరిస్థితులు, ఆకాశ మార్గంలో విధించిన నిబంధనలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో 15 శాతం అంతర్జాతీయ సర్వీసులను తగ్గించాలని నిర్ణయించినట్టు చెప్పింది. జూన్ 20 నుంచి జూలై ప్రథమార్ధం వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.
Also Read : Iran: భారత్ కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్ ! స్వదేశానికి చేరుకున్న 1000 మంది విద్యార్థులు !
