Air India: పాక్‌ గగనతలంపై ఆంక్షలతో ఎయిరిండియాకు భారీ నష్టం

పాక్‌ గగనతలంపై ఆంక్షలతో ఎయిరిండియాకు భారీ నష్టం

Air India : జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ పై భారత్‌ కఠిన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. దీనితో పాకిస్తాన్ సైతం భారత్‌ పై పలు ఆంక్షలు విధించింది. దీనిలో భాగంగా పాక్‌ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌ లోని ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.

Air India Huge Loss

పాక్ గగనతలంపై నిషేదం విధించడంతో ఎయిరిండియా(Air India) సుమారు 600 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. పాక్‌ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌ కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.

ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్‌బైజాన్‌లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్‌ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా(Air India) పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్‌ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్‌ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

Also Read : Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ

Leave A Reply

Your Email Id will not be published!