Airbus: కర్ణాటకలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం
కర్ణాటకలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం
Airbus : దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో(Karnataka) ఏర్పాటు కానుంది. యూరప్ కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్(Airbus), టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్)లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో హెచ్ 125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. తొలుత 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో 500 హెలికాప్టర్ల తయారీ దిశగా దీన్ని విస్తరించనున్నాయి. కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తారు.
Airbus Manufacturing Unit
అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకూ సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతు, ఒప్పంద కార్యక్రమ (ఎంఆర్‌ఓ) కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించనున్నారు. దీనితో పాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ప్రకటించింది.
కమల్ హాసన్ ‘కన్నడ’ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య
కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తీరును కర్ణాటకలోని కాంగ్రెస్, బీజేపీ ముక్తకంఠంతో ఖండించాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కమల్ హాసన్‌కు చరిత్ర గురించి తెలియదంటూ విమర్శించారు.
అసలేం జరిగిందంటే ?
చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ ను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడారు. ‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. దీనితో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నించగా.. ‘‘కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియవనుకుంటా’’ అని ఎద్దేవా చేశారు.
అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పందిస్తూ… మాతృభాషను ప్రేమించడం మంచిదే. కానీ.. ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు నటుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై కమల్ హాసన్ ఇంకా స్పందించలేదు. ఇటీవల కూడా కన్నడ-తమిళ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన పోస్ట్ ఆ వివాదానికి దారితీసింది. తమను ఆయన ద్రవిడులుగా పేర్కొనడంతో కన్నడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Ghulam Nabi Azad : గులాం నబీ ఆజాద్ కు అస్వస్థత ! రియాద్ ఆసుపత్రిలో చేరిక !