PM Modi Shabarimala : అయ్యప్ప సన్నిధిలో ఎయిర్ పోర్ట్
భక్తులకు కేంద్రం బంపర్ ఆఫర్
PM Modi Shabarimala : మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు తీపి కబురు చెప్పింది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున సంక్రాంతి పర్వదినాన లక్షలాది మంది దేశ వ్యాప్తంగా శబరిమలకు అయ్యప్ప దర్శనం కోసం వెళతారు. రైలు , బస్సు మార్గాల ద్వారా, మరికొందరు స్వంత వాహనాలలో శబరిమలకు ప్రయాణం చేస్తారు.
మరో వైపు కోట్లాది మంది భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు గాను తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం కూడా సమకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Shabarimala) స్వయంగా భక్తుడు కావడంతో పాటు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రోడ్లు, ఎయిర్ పోర్ట్ లు, ఓడ రేవుల వల్ల మరింత వ్యాపార, వాణిజ్యం పెరుగుతుందని భావిస్తోంది కేంద్రం.
ఇప్పటికే యూపీలోని అయోధ్యలో రామాలయాన్ని అత్యాధునికంగా పునర్ నిర్మిస్తోంది. ఇది కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఆదివారం ప్రధాన మంత్రి కీలక ప్రకటన చేశారు. అయ్యప్ప భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు గాను అయ్యప్ప స్వామి కొలువు తీరిన శబరిమలకు దగ్గరలో ఎయిర్ పోర్ట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
దీని వల్ల కోట్లాది మంది అయ్యప్ప స్వాములకు మేలు చేకూరుతుందని, ప్రయాణం మరింత సులువవుతుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఎయిర్ పోర్టును మంజూరు చేసిన పీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : శాంతి కోసం అమెరికా..భారత్ ప్రయత్నం