Ajinkya Rahane Catch : అజింక్యా ర‌హానే స్ట‌న్నింగ్ ఫీల్డింగ్

సిక్స్ ను అడ్డుకున్న అజింక్యా

Ajinkya Rahane Catch : బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు ప‌రుగుల వ‌ర‌ద పారించాయి. నువ్వా నేనా అంటూ పోటీ ప‌డ్డాయి.

సీఎస్కే త‌ర‌పున బేస్ ధ‌ర‌కే సెలెక్ట్ అయిన అజింక్యా ర‌హానే(Ajinkya Rahane Catch) అటు బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించాడు. మ‌రో వైపు అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా సిక్స్ వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

కేవ‌లం 20 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ర‌హానే 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 37 ర‌న్స్ చేశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట‌ర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ర‌హానే. చాలాసార్లు ఫోర్ల‌ను నిలిపి వేశాడు. 9వ ఓవ‌ర్ లో చివ‌రి బంతికి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో గ్లెన్ మాక్స్ వెల్ కి వేశాడు.

లాంగ్ ఆఫ్ లో బంతిని బ‌లంగా బాదాడు. ఫీల్డింగ్ లో ఉన్న ర‌హానే దానిని అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. క్యాచ్ ప‌ట్ట‌క పోయినా 5 ప‌రుగులు ఇవ్వ‌కుండా నిలిపాడు. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా చేసింది.

Also Read : చుక్క‌లు చూపించిన మ్యాక్స్ వెల్

Leave A Reply

Your Email Id will not be published!