Kohli Unfollow : గంగూలీని అన్ ఫాలో చేసిన కోహ్లీ
షేక్ హ్యాండ్ ఇవ్వని స్టార్ క్రికెటర్
Kohli Unfollow : భారత క్రికెట్ రంగంలో బీసీసీఐ మాజీ చీఫ్ , ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆర్సీబీ ఆటగాడు, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కోహ్లీ స్కిప్పర్ గా తప్పు కోవడం వెనుక గంగూలీ ఉన్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు కూడా చేసుకున్నారు. తనకు చెప్పకుండానే తీసేశారంటూ కామెంట్స్ చేశాడు కోహ్లీ(Virat Kohli). అతడిని కావాలని తప్పుకునేలా చేశాడని పేర్కొన్నాడు రన్ మెషీన్.
దీనిపై కూల్ గా స్పందించాడు గంగూలీ(Sourav Ganguly. తనకు చెప్పే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని జీటీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ వాస్తవాలు బయట పెట్టాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రత్యర్థులు ఎవరైనా సరే క్రీడా పరంగా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.
కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు విరాట్ కోహ్లీ, గంగూలీ. ఐపీఎల్ 16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. అనంతరం మైదానంలోకి వచ్చిన సమయంలో కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అతడిని దాటి వెళ్లాడు సౌరవ్ గంగూలీ. తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు దాదా, కోహ్లీ. గతంలో దాదాను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో చేస్తూ వచ్చాడు కోహ్లీ(Kohli Unfollow). మొన్నటి ఘటనతో ఇవాళ అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం ఇదే అంశం వైరల్ గా మారింది.
Also Read : ముంబై రె’ఢీ’ సన్ రైజర్స్ సై
