Ajit Pawar : మాదే అసలైన ఎన్సీపీ – అజిత్ పవార్
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం
Ajit Pawar : ఎన్సీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు అజిత్ పవార్. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే , బీజేపీ ఫడ్నవీస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రాజ్ భవన్ కు వెళ్లారు పవార్. వెంటనే సంతకం చేశారు. గవర్నర్ , సీఎం , డిప్యూటీ సీఎంల సమక్షంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అజిత్ పవార్ వర్గంలో మరికొందరికి కూడా కేబినెట్ లో చోటు దక్కింది. ఇక షిండే సర్కార్ లో తొలి మహిళగా కేబినెట్ లో చోటు దక్కించుకుంది అదితి సునీల్ టక్టార్. ఈ సందర్బంగా ఎన్సీపీకి ఢోకా చేశారంటూ శరద్ పవార్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండించారు. అసలైన నేషనలిస్ట్ పార్టీ తమదేనని ప్రకటించారు అజిత్ పవార్(Ajit Pawar). ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
మోదీ నాయకత్వంలో అన్ని రంగాలలో దేశం అభివృద్ది చెందిందని అన్నారు. అందుకే తాను మనసు మార్చుకున్నానని చెప్పారు. గత కొంత కాలం నుంచీ మరాఠా సర్కార్ తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు అజిత్ పవార్
ఇదిలా ఉండగా ఇప్పటికే శివసేన పార్టీ సైతం రెండుగా చీలి పోయింది. ఓ వర్గం బాల్ ఠాక్రే పార్టీగా మరో వర్గం ఏక్ నాథ్ షిండే వర్గంగా చీలి పోయింది. ప్రస్తుతం శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా చీలి పోయే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా.
Also Read : Nara Lokesh : ప్రజా సంక్షేమం టీడీపీ లక్ష్యం – లోకేష్