Akhilesh Yadav : ఇండియా కూట‌మిదే విజ‌యం

మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav  : న్యూఢిల్లీ – మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా కూట‌మి లో భాగంగా ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో అత్య‌ధిక సీట్లు ఉన్నాయ‌ని, ఇక్క‌డ గెలిస్తే మోదీ ఆట‌లు ఇక సాగ‌వ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిపారు.

Akhilesh Yadav Comment

మంగ‌ళ‌వారం ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో కూడిన ఇండియా కూట‌మి స‌మావేశం జ‌రిగింది. ఇందులో పాల్గొన్న అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav ) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాయ మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న బీజేపీ ప‌రివారానికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని మండిప‌డ్డారు.

త‌మ కూట‌మిని గెలిపించేందుకు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌ని, భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో తాము మ‌రింత ముందుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. అభిప్రాయ భేదాలు అన్న‌వి అత్యంత స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు అఖిలేష్ యాద‌వ్.

భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు ప్ర‌యారిటీ ఉంటుంద‌న్నారు. కానీ ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం బీజేపీ ప‌రివారంలో ఉండ‌దంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా గ‌తంలో కంటే ఈసారి అత్య‌ధిక సీట్లు తాము గెలుస్తామ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ప్ర‌స్తుతం త‌మ కూట‌మి బ‌లంగా ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌.

Also Read : Harish Rao : స్పీక‌ర్ కు హ‌రీశ్ రావు లేఖ

Leave A Reply

Your Email Id will not be published!