Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు విడతల పోలింగ్ ముగిసింది.
ఇంకా మూడు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. యూపీలో ప్రధానంగా దళితులు, జాట్ లు, మైనార్టీలు, రైతులే కీలకంగా మారనున్నారు.
రైతులంతా ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి వైపు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ప్రసంగించారు.
రాచరిక పాలన సాగిస్తున్న యోగి ఆదిత్యానాథ్ ఇక మఠానికే వెళ్లాలని ఎద్దేవా చేశారు. తాము అత్యధిక సీట్లు గెలవ బోతున్నామని అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ప్రజా సమస్యలను పట్టించు కోకుండా పాలనను గాలికి వదిలి వేశాడంటూ ఆరోపించారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav ). మొత్తం 403 స్థానాలలో కనీసం మూడో వంతు సీట్లు తమకు రానున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
12వ తరగతి పాసైన తర్వాత ఇంటర్ చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం చేసిన వాగ్ధానాన్ని ఎద్దేవా చేశారు.
ఎవరైనా పది తర్వాత ఇంటర్ చదువుతారని కానీ 12 తర్వాత ఇంటర్ చదువుతారా ఈ విషయం కూడా మంత్రికి తెలియక పోవడం దారుణమన్నారు అఖిలేష్ యాదవ్.
రైతులను పొట్టన పెట్టుకున్న నిందితుడికి ఎందుకు బెయిల్ వచ్చిందంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.
Also Read : తల వంచను ప్రశ్నిస్తూనే ఉంటా