Akunuri Murali Bank Frauds : ఆర్థిక నేరగాళ్లపై చర్యలు ఏవి – మురళి
మోదీ సర్కార్ కు ఆకునూరి ప్రశ్న
Akunuri Murali Bank Frauds : సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) చీఫ్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సర్కార్ ను ఏకి పారేశారు. దేశంలో ఆర్థిక నేరగాళ్లు రోజు రోజుకు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆకునూరి మురళి(Akunuri Murali Bank Frauds). లెక్కలేనంత మంది ప్రభుత్వ బ్యాంకులకు కన్నం వేశారని , తీర్చలేనంతగా అప్పులు చేశామని ఆరోపించారు. 2014లో కొలువు తీరిన మోదీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి తీర్చలేక పోయారని మండిపడ్డారు.
కేవలం వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా కేంద్ర సర్కార్ యత్నిస్తోందంటూ ఫైర్ అయ్యారు. నిన్నటి దాకా గౌతం అదానీని వెనకేసుకు వచ్చారని ప్రస్తుతం అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసర్చ్ గ్రూప్ వెల్లడించిన నివేదిక కలకలం సృష్టించిందని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఎందుకని నిర్వీర్యం చేస్తోందంటూ ప్రశ్నించారు ఆకునూరి మురళి.
ఇవాళ వ్యాపారవేత్తలు కొత్త టెక్నిక్ కనుక్కున్నారని ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బులను కొల్లగొట్టడమే అలవాటుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రస్తుతం చాలా ప్రమాదాకరమైన ఆట ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సొమ్ముతో రూ. 10 లక్షల కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించారు ఆకునూరి మురళి. కోట్లు కొల్లగొట్టిన వాళ్లకు ఎలా కేంద్రం రద్దు చేస్తుందంటూ ప్రశ్నించారు ఎస్డీఎఫ్ చీఫ్. ఇలాగే చేస్తూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ఆవేదన చెందారుసోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) చీఫ్.
Also Read : మోదీ..ఓవైసీకి అంత సీన్ లేదు