Akunuri Murali : ప్రభుత్వ సలహాదారుగా ఆకునూరి..?
కేసీఆర్ సర్కార్ పై అలుపెరుగని యుద్దం
Akunuri Murali : హైదరాబాద్ – రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ మారింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే తనదైన ముద్ర వేశారు. వచ్చీ రావడంతోనే తాము పాలకులం కాదని సేవకులం అని స్పష్టం చేశారు. ఎవరైనా తనను వచ్చి కలుసు కోవచ్చని స్పష్టం చేశారు. ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Akunuri Murali As a Govt Advisor
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సచివాలయానికి వెళ్లారు. మంత్రులుగా కొలువు తీరిన వారికి శాఖలు కేటాయించారు. సీఎం కుర్చీపై ఆశీనులైన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంఓ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రిని ఎంపిక చేశారు.
ఇక పోలీసు శాఖా పరంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ పోలీస్ ఆఫీసర్ , మచ్చలేని అధికారిగా గుర్తింపు పొందిన 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారులుగా మొదట ముగ్గురిని ఖరారు చేసినట్లు సమాచారం.
తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాంకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించాలని, అంతే కాకుండా విద్యా, ఉద్యోగాల భర్తీకి సంబంబంధించి సీనియర్ అధికారి ఆకునూరి మురళి(Akunuri Murali), గాదె ఇన్నయ్యకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించనున్నారు సమాచారం.
Also Read : Kodandaram : కోదండరాంకు కీలక పదవి