Akunuri Murali : అక్రమాలపై విచారణ చేపట్టాలి
ఆకునూరి మురళి డిమాండ్
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీస్ ఆకునూరి మురళి(Akunuri Murali) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Akunuri Murali Comment about Kaleshwaram
సిట్టింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నీటి పారుదల రంగాలలో అనుభవం కలిగిన నిపుణులతో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థిక, సామాజిక నిపుణులతో టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాఉట చేయాలని సూచించారు ఆకునూరి మురళి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఇచ్చారో , ఎన్ని ఎకరాలు పండాయో, ఎంత వరకు విద్యుత్ బిల్లులు వచ్చాయో బయటకు చెప్పాలన్నారు . మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కూలి పోవడగానికి కారణం ఎవరు అనేది కూడా తేలాలని అన్నారు ఆకునూరి మురళి.
జరిగిన నష్టం ఎవరు భరించాలని ప్రశ్నించారు. తమకు ఎలాంటి సంబంధం లేదంటూ గుత్తేదారు చెప్పడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు ఆకునూరి మురళి.
Also Read : Chandra Babu Lokesh : అమరావతినే ఏపీకి రాజధాని