Akunuri Murali : ఓటర్ల సునామీలో బీఆర్ఎస్ గాయబ్
ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి(Akunuri Murali) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు అధికార పార్టీపై విరుచుకు పడ్డారు.
Akunuri Murali Comments on BRS
ఓటమి భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వణుకుతున్నారని అన్నారు. చివరకు గత్యంతరం లేక బ్లాక్ మెయిల్ నాటకాలకు తెర లేపారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మరిచి పోయిన, ఆగం చేసిన, నిర్లక్ష్యం చేసిన విద్య, వైద్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కౌలు రైతులు , ఆత్మహత్యలు, అమర వీరుల బలిదానాల శాపాలు ఊరికే పోవని అన్నారు.
కేటీఆర్ కు ఏమో నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్లు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, కొత్త రేషన్కార్డులు, ధనవంతులకు రైతు బంధు ఇవ్వ వద్దని లాంటి సమస్యలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు ఆకునూరి మురళి.
కవిత అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆమెను చూస్తేనే లిక్కర్ రాణి గుర్తుకు వస్తోందన్నారు. సీన్ మొత్తం మారి పోయిందని , రాష్ట్రంలో ఓటర్ల సునామీలో బీఆర్ఎస్ కొట్టుకు పోవడం పక్కా అని జోష్యం చెప్పారు. విచిత్రం ఏమిటంటే హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఏకంగా గెలిపించక పోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పడం దారుణమన్నారు.
Also Read : G Kishan Reddy : మజ్లిస్ ను పెంచి పోషించింది కాంగ్రెస్సే