Akunuri Murali : విద్యతోనే వికాసం భవిష్యత్తుకు మార్గం
ఏపీ విద్యా శాఖ కన్సల్టెంట్ ఆకునూరి మురళి
Akunuri Murali : ఆయన పేరొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. మోస్ట్ కమిటెడ్ ఆఫీసర్లలో ఒకరిగా పేరొందారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో సమర్థవంతంగా పని చేశారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటారు.
ఆయనే ఆకునూరి మురళి(Akunuri Murali). ప్రస్తుతం తన వాయిస్ ను తెలంగాణ అభివృద్ధి కోసం వినిపిస్తున్నారు. ప్రధానంగా ఆయన చేపట్టిన ఎడ్యుకేషన్ ఫార్ములా దేశాన్ని ఆకర్షిస్తోంది.
తాజాగా ఆకునూరి మురళి గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన విద్యా శాఖ మంత్రుల వర్క్ షాప్ కు హాజరయ్యారు. కొన్ని రాష్ట్రాల నుండి అభ్యాస అనుభవం పనికి వచ్చిందని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని ఆకునూరి మురళి తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. పలు భాషల్లో పట్టు ఉండడమే కాదు ఐఏఎస్ అధికారులలో నిబద్దత, నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా పేరొందారు.
ప్రధానంగా ఆకునూరి మురళి(Akunuri Murali) తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రధానంగా ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఆయనపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఎలా విద్య, ఆరోగ్యం రంగాలను నాశనం చేశాడనే దానిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ చాలా బాగుందంటూ ప్రశంసించారు ఆకునూరి మురళి.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య తోనే వికాసం అలవడుతుందని, అది మంచి భవిష్యత్తుకు మార్గం ఏర్పడేలా చేస్తుందని పేర్కొన్నారు.
Also Read : గ్రూప్ -1 దరఖాస్తుల గడువు పెంపు