Akunuri Murali : ముమ్మాటికీ కల్వకుంట్ల కుటుంబ పాలనే
ఆకునూరి మురళి సంచలన కామెంట్స్
Akunuri Murali : మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు. ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న పాలన సాగడం లేదన్నారు. కానీ కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు.
ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళి(Akunuri Murali) స్పందించారు. అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి ఒక్క మంచి పని కూడా చేసిన పాపాన పోలేదన్నారు ఆకునూరి మురళి. తాను కూడా తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సభ్యుడినేనని కానీ ఉండేందుకు ఇల్లు కూడా లేదన్నారు.
కానీ దొరకు, ఆయన కుటుంబానికి రాచరికాన్ని తలపింప చేసే భవంతులు, ఫామ్ హౌస్ లు, లెక్కలేనన్ని వాహనాలు , అంతు చిక్కని సంపద దాగి ఉందన్నారు. మా కుటుంబ పెద్దాయన ఆస్తి మొత్తం ఇప్పుడు లక్ష కోట్లకు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు ఆకునూరి మురళి. కానీ నా ఆస్తి మొత్తం రూ. 1,000 కానీ సీఎంకే తిరిగేందుకు గాలి మోటర్ ఉందన్నారు.
సిగ్గుండాలి..ఇలా చెప్పేందుకు..ఇలా ఎంత కాలం అబద్దాలు చెబుతూ బతుకుతారంటూ నిలదీశారు మాజీ ఐఏఎస్ . ఇకనైనా ప్రజలు మేలు కోవాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు ఆకునూరి మురళి(Akunuri Murali).
ఇంకా ఎన్ని రోజులు ఈ దొంగ మాటలు చెబుతారంటూ నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా అవినీతి పరమైన పాలన అని ఆరోపించారు.
Also Read : కేటీఆర్ కామెంట్స్ ఆర్ఎస్పీ సెటైర్