Akunuri Murali : హైకోర్టు తీర్పు చెంపపెట్టు
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – మాజీ ఐఏఎస్ ఆఫీసర్ , సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రభుత్వ పనితీరును మరోసారి ఎండగట్టారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ స్పష్టం చేశారు.
Akunuri Murali Comments Viral
సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ సర్కార్ ను నిలదీశారు. ఈ సందర్బంగా గ్రూప్ -1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించారు. న్యాయం ఇంకా బతికే ఉందని ఈ తీర్పు నిరూపించిందని పేర్కొన్నారు.
అడ్డగోలుగా పరీక్షను నిర్వహించారని, దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సంస్థ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఆకునూరి మురళి(Akunuri Murali). హైకోర్టు తీర్పుతో విలువైన కాలాన్ని అభ్యర్థులు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎంతో మందికి అన్యాయం జరిగిందన్నారు. వెంటనే చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన పడకేసిందని, అన్యాయం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.
Also Read : Nara Brahmani : ఐటీ ఉద్యోగులకు థ్యాంక్స్