Akunuri Murali : సర్కారు బడులపై కేసీఆర్ శీతకన్ను
ఇంకానా ఇకపై చెల్లదంటున్న మురళి
Akunuri Murali : మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా కావాలని కొలువు తీరిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంత కాలం నుంచీ విద్య, ఆరోగ్యం, ఉపాధి విధిగా ప్రజలకు ఉండాలని , ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందు పర్చబడిందని స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో బిజీగా ఉన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali) .
సమాజం బాగు పడాలంటే, పురోభివృద్ది సాధించాలంటే విద్య తప్ప మరో మార్గం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని సామాన్యులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు , గిరిజనులను దూరం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లు లేరనే సాకుతో బడులను మూసి వేస్తోందని ఆరోపించారు.
మౌలిక సదుపాయాలు కల్పించకుండా పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఆకునూరి మురళి. రాష్ట్రం అన్ని వ్యవస్థలను పనిగట్టుకుని నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రధానంగా విద్యా వ్యవస్థను ప్రైవేట్ చేతుల్లో పెట్టాడని, డబ్బున్న వాళ్ల పరం చేశాడని, కార్పొరేట్ శక్తులకు అప్పగించాడంటూ ధ్వజమెత్తారు.
తాజాగా తాన స్వంత మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు ఆకునూరి మురళి(Akunuri Murali) . ఈ సందర్భంగా పాడు బడిన గోడలను చూసి విస్తు పోయారు. ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా