Akunuri Murali : దొర పాలనలో భూములు అన్యాక్రాంతం
రీజినల్ రింగ్ రోడ్ ఎవరడిగారు
Akunuri Murali : సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరు అడిగారని రూ. 30,000 కోట్ల ఖర్చు పెట్టి 340 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించారు ఆకునూరి మురళి(Akunuri Murali). ఇది మొదటి ప్రాధాన్యతనా అని నిలదీశారు. వేల కోట్ల అవినీతి కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు. కేసీఆర్ , గ్యాంగ్ భూ మాఫియాకు పాల్పడేందుకు ప్లాన్ చేశారంటూ ధ్వజమెత్తారు. దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు తెలుపుతోందని ఆరోపించారు.
విద్యా రంగాన్ని గాలికి వదిలి వేశారని, ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి. బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల రైతులు భూములను కోల్పోతారని మండిపడ్డారు. పాలన గాడి తప్పిందని, సీఎం సోయి తప్పి నిద్ర పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెబుతూ మరోసారి ఎన్నికల బరిలోకి రావాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ధరణి పేరుతో దోచు కోవడం తప్ప పేదలకు న్యాయం చేసిన పాపాన పోలేదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దొర పాలన సాగిస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని హెచ్చరించారు.
Also Read : Vijay Sai Reddy Lokesh : నారా లోకేష్ పై విజయ సాయి ఫైర్