Satya Pal Malik : అదానీ సొమ్మంతా ప్రధాని మోదీదే
మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్
Satya Pal Malik : జమ్మూ – కాశ్మీర్ , మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి చెందిన సొమ్మంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిందే అంటూ నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో తనకు రెండు కేసులు క్లోజ్ చేసేందుకు రూ. 150 కోట్ల లంచంగా ఇస్తామని ఆఫర్ వచ్చిందన్నారు.
కానీ ఆ రెండింటి కేసులను రద్దు చేశానని చెప్పారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఇందుకు సంబంధించి తాను ఫిర్యాదు చేశానని , రెండు సార్లు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టిందని అన్నారు. కానీ లంచం ఇస్తున్న వారిపై ఇప్పటి వరకు విచారణ జరగ లేదని దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం ఎవరి వైపు ఉందో అర్థం చేసుకోవాలన్నారు సత్య పాల్ మాలిక్.
ప్రస్తుతం మాజీ గవర్నర్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అంతే కాదు వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించక పోతే గనుక దేశం తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. యావత్ దేశమంతా మరో మణిపూర్ లా కాలి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్.
ఇప్పటి వరకు మణిపూర్ లో 100 మందికి పైగా చని పోయారు. 60 వేల మంది రాష్ట్రాన్ని వదిలి పెట్టి పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 10 వేల మంది సైనికులు మోహరించారు. అక్కడ బీజేపీ సర్కార్ ఉంది. ఎందుకని మోదీ మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
Also Read : Pawan Kalyan : హీరోల అభిమానులు సపోర్ట్ చేయండి – పవన్