Allahabad HC : ఆది పురుష్ పై హైకోర్టు ఆగ్రహం
మనో భావాలు ఇలాగే చిత్రీకరిస్తారా
Allahabad HC : ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ పై ఇంకా వివాదాలు వెంటాడుతున్నాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా తీసిన ఈ మూవీ పూర్తిగా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు(Allahabad HC) సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూర్తి కించ పరిచేలా, చులకన చేసేలా తీసిన ఆది పురుష్ ను ఎలా సర్టిఫై చేశారంటూ సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పలు ప్రశ్నలు సంధించింది. ఈ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం అతి పెద్ద తప్పిదంగా పేర్కొంది హైకోర్టు. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది.
తప్పుడు వాస్తవాలతో ఖురాన్ పై డాక్యుమెంటరీని రూపొందించడం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అని చురకలు అంటించింది నిర్మాతలు, దర్శకుడిని. ఇవాళ మనమంతా నోరు మూసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని నిలదీసింది కోర్టు.
సినిమాలో పాత్రధారులు వేసుకునే వేష ధారణ దారుణంగా ఉంది. మన దేవుళ్లను ఇలాగే ఊహించు కోగలమా ఒక్కసారిగా ఆలోచించాలని సూచించింది దర్శకుడికి. రామ్ చరిత్ మానస్ అనేది ఒక పవిత్ర గ్రంథం. ప్రజలు తమ ఇళ్లను విడిచి పెట్టే ముందు దానిని పఠిస్తారు. దానిని అత్యంత దారుణంగా, దయనీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. రాముడు, లక్ష్మణుడు, సీతను గౌరవించే వారు ఇలాంటి సినిమాలు చూడలేరంటూ పేర్కొంది.
Also Read : Singer Saichand : గాయకుడి మరణం తెలంగాణకు నష్టం