AP GOVT : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకేటాయించింది.
ఇందులో భాగంగా మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయించింది.
మంత్రి ఆదిమూలపు సురేష్ కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్న బాబుకు జిఏడీ శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ , ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం సందింటి
అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇదిలా ఉండగా ఏపీ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు.
ఆయన వారం రోజుల పాటు దుబాయిలో జరిగిన ఎక్స్ పో లో పాల్గొన్నారు. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పలు కంపెనీలతో ఆయన చర్చలు జరిపారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న సత్ సంకల్పంతో ఎనలేని కృషి చేశారు.
చాలా చిన్న వయసులో గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఏపీ రాష్ట్రం కీలకమైన నాయకుడిని, మంత్రిని కోల్పోయింది.
ఇదిలా ఉండగా ఆయన భార్యకు ఎమ్మెల్యే పదవి ఇచ్చే చాన్స్ ఉందని సమాచారం. లేదా తనయుడు కూడా దక్కే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్(AP GOVT) తన కుటుంబంలో ఒకడిని కోల్పోయినంత బాధగా ఉందన్నారు.