#AlluArjun : కూతురి మురిపెం – బన్నీ ఆనందం
మనసు దోచేస్తున్న అల్లు అర్హ
Allu Arjun : పిల్లలు దేవులు చల్లని వారే. కల్ల కపటం తెలియని అమాయకులు. వాళ్లు చేసే చిలిపి చేష్టలు. అల్లరి. నవ్వులు. ముద్దు లొలికే మాటలు ఇవ్వన్నీ కన్న వారిని ఇంప్రెస్ చేస్తాయి. పెద్ద వాళ్ల కంటే పిల్లలుగా ఉండడమే తనకు ఇష్టం అంటుంటారు అప్పుడప్పుడు. జీవితంలో ఒక స్టేటస్ రావాలన్నా. లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటే తల్లిదండ్రులు కావాల్సిందే.
ఆ మురిపెం గుండెల్లో దాచు కోవాలంటే కాస్తంతా సెన్సాఫ్ హ్యూమర్ తో పాటు కాసింత ప్రేమ కూడా కావాల్సిందే. పెళ్లి కంటే ముందు అల్లు అర్జున్(Allu Arjun) వేరు. మ్యారేజ్ అయి, పిల్లలు పుట్టాక బన్నీ పూర్తిగా మారి పోయాడు. టాలీవుడ్ లో మరో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంతే. ఆయనకు ఫ్యామిలీ, పిల్లలంటే పంచ ప్రాణం. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా బన్నీ కూతురు అల్లు అర్హ తన తండ్రి అల్లు అర్జున్ తో కలిసి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే వీరు కూడా తమ పేరుతో అకౌంట్లు కూడా తెరిచేస్తున్నారు. ఈ చిన్నారులు అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. కొడుకు అల్లు అయాన్ కంటే కూతురు అర్హ ఎక్కువ పాపులర్ అవుతోంది.
లాక్ డౌన్ సమయంలో పిల్లలతో మరీ దగ్గరై పోయాడు బన్నీ(Allu Arjun). తాజా వీడియోలో అర్జున్, అర్హ మాట్లాడుకుంటున్న మాటలు హల్ చల్ చేస్తున్నాయి. ఏమన్నావ్ ఏమన్నా అంటూ అన్న మాటలు వినడానికి బావున్నాయి. బన్నీ సుకుమార్ తో పుష్ప లో నటిస్తున్నాడు.
No comment allowed please