#AlluduAdurs: అల్లుడు అదుర్స్ సూప‌ర్ హిట్టే

Alludu Adurs : త‌న కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ అల్లుడు అదుర్స్ కు అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రావడం లేదని, సినిమా యావ‌రేజ్‌గా ఉందంటూ ఫిలింన‌గ‌ర్‌లో వ‌స్తున్న వార్త‌ల‌పై

Alludu Adurs : త‌న కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ అల్లుడు అదుర్స్ కు అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రావడం లేదని, సినిమా యావ‌రేజ్‌గా ఉందంటూ ఫిలింన‌గ‌ర్‌లో వ‌స్తున్న వార్త‌ల‌పై చిత్ర నిర్మాత‌ నిర్మాత బెల్లంకొండ‌ సురేష్ బాబు ఘాటుగానే స్పందించారు. త‌మ‌ సినిమా సూపర్ హిట్ అయ్యందంటూ కలెక్షన్స్ వివరాలు మీడియా ముందు వెల్ల‌డించారు.

సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా సురేష్ సక్సెస్ మీట్ లో ఇచ్చిన బెల్లంకొండ సురేష్ (Alludu Adurs)మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అల్లుడు అదుర్స్ సినిమా మొదటిరోజు మూడు కోట్ల షేర్స్ ను అందిస్తే అస‌లు ఓపెనింగ్స్ లేవంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. నాకుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినీ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్ సినిమాల్లో ఒకటి. ప్ర‌స్తుత క‌రోనా సీజ‌న్‌లో ఆఫ్ సీట్ ఆక్య‌పెన్సీలో గ‌త మూడు రోజుల్లోనే 10కోట్ల షేర్ ను అందుకుందంటే సూపర్ హిట్ కాదా అని నిల‌దీసారు.

ఈ సినిమాకు హీరో రెమ్యునరేషన్ లేకుండా చూస్తే 32కోట్ల వరకు ఖర్చయ్యింది. ఎంత కాస్ట్లీగా ద‌ర్శ‌కుడు తెరకెక్కించారో తెరపైనే స్ప‌ష్టంగా కనిపించిందా లేదా అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన‌ సాటిలైట్ , ఆడియే రైట్స్ 21 కోట్ల‌కు పోయాయ‌ని, మేం రిస్క్ చేసింది కేవలం 11కోట్లకు మాత్ర‌మేన‌ని, తొలి మూడు రోజుల‌లోనే దాదాపు ఆ మొత్తం వ‌చ్చేస్తే, నిర్మాత నిండా మునిగాడ‌న్న అర్ధం లేనిప్ర‌చారం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్(Alludu Adurs) తప్పకుండా 50కోట్ల క్లబ్ లో ఉంటాడు రానున్న రోజుల‌లో నిర్మాత‌కు మిగిలేవ‌న్ని లాభాలేన‌ని గుర్తుంచుకుంటే మంచిద‌ని అన్నారు.

No comment allowed please