Amaravati: వరద నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం !
వరద నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం !
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం ప్రారంభించింది. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించింది. ఇప్పటికే వరద నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక సిద్దం చేశారు. వరద వలన జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు.
Amaravati Floods..
భారీ వర్షాలు, వరదల కారణంగా 7 జిల్లాలు ప్రభావితమయ్యాయని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రభావం ఉందని వివరించారు. బుడమేరు కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక, పునరావాస చర్యలపై నివేదిక అందజేశారు. వరదలు, భారీ వర్షాల ధాటికి 32 వార్డులు, 161 సచివాలయాల పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, వాయుసేన హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరించామని, పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫొటోలను కేంద్ర బృందం ఎదుట అధికారులు ప్రదర్శించారు.
Also Read : YS Jagan Mohan Reddy: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి