Amaravati: అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
Amaravati : అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఏపీ (AP) సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాల (GAD టవర్) నిర్మాణ టెండర్లను ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1, 2 హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజి సంస్థ దక్కించుకుంది. రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3, 4 హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణ పనులను లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది. రూ.1303.85 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనుంది. ఎల్ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Amaravati – కర్నూలు సమీపంలో రిలయన్స్ పరిశ్రమకు భూమి కేటాయించిన ప్రభుత్వం
కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఏపీ (AP) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో శీతలపానియాలు, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆదేశాల్లో సర్కారు తెలిపింది.
పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఈనెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఎపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఎపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీఐఐసీ చైర్మన్, ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : Road Accident: రోడ్లు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై, కానిస్టేబుల్ మృతి
