Amarnath Yatra: కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

Amarnath Yatra : కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్రకు 5,880 మందికి పైగా భక్తుల తొలి బ్యాచ్‌ బుధవారం జమ్ము నుంచి బయల్దేరింది. తెల్లవారుజామున 4.30 గంటలకు భగవతీ నగర్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) మనోజ్‌ సిన్హా జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. తొలి బ్యాచ్‌లో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు ఉన్నారు.

Amarnath Yatra Started with Full Security

38 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర గురువారం నుంచి రెండు మార్గాల్లో (పహల్గాం, బాల్టాల్‌) ప్రారంభం కానుంది. వచ్చే నెల 9తో ముగియనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజ్‌భవన్, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి యాత్రను 24 గంటలూ పర్యవేక్షిస్తామని ఎల్జీ సిన్హా చెప్పారు. యాత్రను ప్రారంభించేముందు సిన్హా పూజలు నిర్వహించారు. ప్రాంగణమంతా ‘హర హర మహాదేవ్, భం భం భోలే’ నినాదాలతో మార్మోగింది.

Also Read : SpiceJet : గాల్లో ఉండగా ఊడిన స్పైస్‌ జెట్‌ కిటికీ ఫ్రేమ్‌

Leave A Reply

Your Email Id will not be published!