Amartya Sen : భారత దేశానికి చెందిన ప్రపంచ దిగ్గజ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ మంగళవారం కన్నుమూశారు. యావత్ ప్రపంచం ఆయన లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతోంది. తన జీవిత కాలమంతా ప్రజల కోసం, సమాజం కోసం తపన పడ్డారు.
Amartya Sen No More
అత్యంత ప్రభావంతమైన ఆలోచనా పరుడిగా గుర్తింపు పొందారు. ఆర్థిక శాస్త్రం, సామాజిక తత్వ శాస్త్రం, సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో విశేషంగా కృషి చేశారు అమర్త్య సేన్(Amartya Sen). ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు 89 ఏళ్లు. ఆయన మరణ వార్తను అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కాగా భారతీయ అధికారులు లేదా సేన్ కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్ లోని శాంతినికేతన్ లో నవంబర్ 3, 1933 న పుట్టారు.
సంక్షేమ ఆర్థిక శాస్త్రానికి కరువు, పేదరికం, మానవ అభివృద్దిపై చేసిన కృషికి గాను అమర్త్య సేన్ కు 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మెమోరియల్ బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రం నైతిక పునాదులను అర్థం చేసుకోవడం, అసమానతలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు అమర్త్య సేన్.
Also Read : Task Force Raids : భారీగా నగదు..బంగారం పట్టివేత
