Amartyasen: హిందువులు, ముస్లింలు కలిసుండటమే భారత సంప్రదాయం.

హిందువులు, ముస్లింలు కలిసుండటమే భారత సంప్రదాయం.

Amartyasen: హిందువులు, ముస్లింలు కలిసి జీవించే సంప్రదాయం భారతదేశానికి ఉందని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. దేశంలో ఎటువంటి భేషజాలు లేకుండా హిందువులు, ముస్లింలు కలిసి జీవించే సంప్రదాయం భారతదేశానికి ఉందని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్(Amartyasen)(90) అన్నారు. అలీపూర్ జైలు మ్యూజియంలో పుస్తక పఠనానికి సంబంధించి శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మన దేశ చరిత్రను పరిశీలిస్తే హిందువులు, ముస్లింలు సంపూర్ణ సమన్వయం, సామరస్యంతో జీవిస్తున్నారు. దీనిని ‘జుక్తోసాధన’ అంటారని క్షితిమోహన్ సేన్ తాను రాసిన ఓ పుస్తకంలో చెప్పారు.

Amartyasen..

ప్రజల మధ్య విభేదాలు తలెత్తుతున్న నేటి సమాజంలో మతసహనం అవసరం. దేశం కోసం ప్రజలంతా కలిసి పని చేయాలి’’అని పేర్కొన్నారు. మతపరమైన అణచివేతలకు పాల్పడుతున్న వారు ముంతాజ్ కుమారుడు దారాషికో ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించారన్న విషయాన్ని మరిచిపోతున్నారని చురకలు అంటించారు. పిల్లల్లో ఎలాంటి భేద భావాలు ఉండవు కాబట్టి వారిలో ఈ సమస్యలు తలెత్తవన్నారు. దీనిని పూర్తిగా నిర్మూలించాలంటే వారిలో మతపరమైన విషబీజాలు నాటకూడదన్నారు. కళలు, సామాజిక సేవ, రాజకీయాల్లో ‘జుక్తోసాధన’ కనిపిస్తుందన్నారు.

మనం ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్ల శాస్త్రీయ సంగీత శైలి ప్రకారం వారిలోని వ్యత్యాసాన్ని చూడగలం కానీ..మతపరంగా చూడలేము కదా? అని ఆయన ప్రశ్నించారు. తాజ్మహల్ విషయంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయని అమర్త్యసేన్ పేర్కొన్నారు. కొందరు దీనిని ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన అద్భుతమైన కట్టడంగా చూస్తుంటే..మరికొందరు మాత్రం ముస్లిం పాలకుల పేరుతో ఉన్న ఈ స్మారక చిహ్నాల పేర్లను మార్చాలని కోరుతున్నారన్నారని అన్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలే మనకు చెప్పుతున్నాయి అని అమర్త్యసేన్ మాట్లాడుతూ భారత్ హిందూదేశం కాదని నిరూపించాయన్నారు…

Also Read : Nandhamuri balakrishna: వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది

Leave A Reply

Your Email Id will not be published!