Amazon Layoffs : అమెజాన్ లో 9 వేల మంది తొలగింపు
అన్ని రంగాలు కుదేలు
Amazon Layoffs Latest : ఆర్థిక మాంద్యం దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పటికే ట్విట్టర్ , ఫేస్ బుక్ మెటా , గూగుల్ , పానా సానిక్ , ఫిలిప్స్ తో పాటు తాజాగా అమెజాన్(Amazon Layoffs Latest) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఊహించని రీతిలో మరోసారి ఝలక్ ఇచ్చింది.
ప్రస్తుతం 9 వేల మందిని సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కంపెనీపై పడిందని అందుకే తొలగించక తప్పడం లేదని పేర్కొంది అమెజాన్. కంపెనీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి ) ఆండీ జెస్సీ వెల్లడించారు.
మొదట ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టెస్లా చైర్మన్, ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్. ఆ తర్వాత ఫేస్ బుక్ మెటా 10 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని , గూగుల్ 19 వేల మందికి పైగా తొలగించగా, ట్విట్టర్ 11 వేల మందికి పైగా ఇంటికి పంపింది. దిగ్గజ కంపెనీలన్నీ కోలుకోలేని షాక్ ఇస్తూ వచ్చాయి. ఇదే సమయంలో అమెజాన్(Amazon Layoffs) కూడా ఇదే బాట పట్టింది.
నవంబర్ , 2022లో ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ స్టోర్స్ లో 18 వేల మందిని తొలగించింది. కంపెనీ సెకండ్ రౌండ్ కింద 20 మార్చి, 2023న మరో 9 వేల మందిని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు అమెజాన్ సిఇఓ. ఇప్పటి వరకు సంస్థలో తొలగించిన వారి సంఖ్య నాలుగు నెలల్లోనే 27 వేల మంది కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఇంకెంత మందిని తొలగిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఉద్యోగుల్లో.
Also Read : రూ. 2 వేల నోట్లపై నిర్మల కామెంట్స్