Ambati Rambabu : లోకేష్ ఓ బఫూన్ – అంబటి రాంబాబు
తెలుగే సరిగా రాదని ఆగ్రహం
Ambati Rambabu : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాం బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఓ పొలిటికల్ లీడర్ కాదన్నారు. శనివారం అంబటి రాంబాబు(Ambati Rambabu) మీడియాతో మాట్లాడారు. లోకేష్ పోకేష్ లాగా రెచ్చ గొడుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.
Ambati Rambabu Slams Nara Lokesh
లోకేష్ ఓ బఫూన్ , ఓ పిల్లకాకి అంటూ ఎద్దేవా చేశారు. సరిగా తెలుగు పలకడం రాని వ్యక్తి పాలిటిక్స్ లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. మాట్లాడడం రాదు..సరిగా పదాలు పలకడం రాదు. అంతే కాదు నారా లోకేష్ కి టీచింగ్ చెప్పేందుకు వచ్చిన టీచర్లను గోకాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జీవితం అంతా అబద్దాల మయం. అందుకే లోకేష్ లాంటి భాష రాని పుత్రుడు పుట్టాడంటూ ఫైర్ అయ్యారు నీటి పారుదల శాఖ మంత్రి. ఇక నుంచైనా సత్యాలు చెప్పేందుకు ప్రయత్నం చేయాలని సూచించాడు.
ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా చివరకు ఓట్లు వేసేది జగన్ రెడ్డికి తప్ప మీలాంటి బఫూన్లకు కాదన్నారు అంబటి రాంబాబు. జనం కోసం వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన చరిత్ర తమ నాయకుడికి ఉందన్నారు. చంద్రబాబు అంటేనే మోసం , దగా అన్నారు.
Also Read : Gouthu Sirisha : జగన్ చెప్పేవన్నీ అబద్దాలు – గౌతు శిరీష