Ambati Rambabu : పవన్..లోకేష్ పై అంబటి ఫైర్
ఇద్దరి వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ ఉండదు
Ambati Rambabu : పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్దరి వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఏపీలో ఎంత మంది వచ్చినా లేదా ఎన్ని పార్టీలు ఒక్కటైనా వైసీపీకి సాటి రావని పేర్కొన్నారు.
వారాహి ప్రచార రథం, లోకేష్ యువ గళం పాదయాత్రల వల్ల ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వర్కవుట్ కావని పేర్కొన్నారు అంబటి రాంబాబు(Ambati Rambabu) . ఈ దేశంలో అత్యున్నతమైన రీతిలో పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు.
దేశానికి ఏపీ ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన నాడు నేడు కార్యక్రమం కేంద్రం పలుమార్లు ప్రశంసించిందని వెల్లడించారు అంబటి రాంబాబు.
ఇక 4 వేల కిలోమీటర్లు తిరిగినా జనం టీడీపీని, జనసేనను నమ్మే స్థితిలో లేరన్నారు. గతంలో కలిసి ఉన్నారు ఇప్పుడు కలుసు కోవడం ఏమిటో జనాలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేని పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు.
నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుతామని పేర్కొన్నారు.
Also Read : తారకరత్న ఆరోగ్యం పదిలం