Arvind Kejriwal : ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. కానీ ఈరోజు వరకు చాలా మందికి చదువుకునేందుకు వీలు కలగడం లేదన్నారు.
భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల ఒక్కటే ప్రతి ఒక్కరు చదువు కోవాలని. కానీ ఆయన కలల్ని కొన్ని రాజకీయ శక్తులు, గతంలో ఏలిన పాలకులు అమలు చేయడంలో విఫలమయ్యారు.
కానీ తాము ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఆయన కన్న కలల్ని నిజం చేస్తున్నామని చెప్పారు.
గత ఏడు సంవత్సరాల కాలంలో తమ ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో 20 వేల క్లాస్ రూమ్స్ నిర్మించడం జరిగిందని తెలిపారు. గత కొంత కాలంగా కొందరు రాజకీయ నాయకులు తనను టార్గెట్ చేశారని అన్నారు.
అయినా ఒక ప్రధాన పదవిలో ఉన్న తనను లక్ష్యంగా చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. కానీ రాజకీయాలలో ఉన్న వారు చేసే విమర్శలు పారదర్శకంగా ఉండాలన్నారు సీఎం. తనను చివరకు టెర్రరిస్టుగా కామెంట్ చేయడం బాధ కలిగించిందన్నారు.
ఇప్పుడున్న నాయకులకు విద్య అంటే పడదన్నారు. కానీ తాము ఈ దేశ భవిష్యత్తు స్కూళ్లల్లో ఉంటుందని అన్నారు అరవింద్ కేజ్రీవాల్.
కులం, మతం, వర్గ విభేదాలు లేని ఒకే ఒక్క స్థలం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్కటే స్కూల్. అందుకే తాము పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.
Also Read : ‘గోబర్ ధన్’ ను ప్రారంభించిన మోదీ